బీఆర్ఎస్‌కు గుడ్‌బై.. కాంగ్రెస్‌లోకి అనిశెట్టి రామకృష్ణ

గోవిందరావుపేట మండలం పసర గ్రామానికి చెందిన రైస్‌మిల్లు యజమాని అనిశెట్టి రామకృష్ణ బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పైడాకుల అశోక్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మంత్రి సీతక్క రామకృష్ణను కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు నాయకులు తెలిపారు. రామకృష్ణ చేరికతో ములుగు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరుతుందని నాయకులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕