పంచాయతీలకు భారీ అభివృద్ధి నిధులు

ఎన్నికలు జరగని గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి, పారిశుద్ధ్య పనులు నిలిచిపోకుండా నిధులు మంజూరు చేయడం అభినందనీయమని మంగపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చెట్టుపెళ్లి వెంకటేశ్వర్లు అన్నారు. ప్రత్యేక పరిస్థితుల వల్ల మండలం లోని 25 పంచాయతీల్లో ఎన్నికలు జరగనప్పటికీ, మౌలిక సదుపాయాల కోసం మంత్రి సీతక్క చొరవతో 1, 76, 86, 065 నిధులు మంజూరయ్యాయని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్కకు, అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు జరగని 58 పంచాయతీలకు నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕