మేడారం జాతరలో సమ్మక్క రాకతో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. అంచనాలకు మించి భక్తులు రావడంతో దర్శనం కోసం వేల సంఖ్యలో క్యూలైన్లు స్తంభించిపోయాయి. విఐపి, వివిఐపి లైన్ల వద్ద కూడా భక్తుల రద్దీ అధికంగా ఉంది. పాసులు ఎందుకు ఇచ్చారని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఇంత జనంలో ఎవరికైనా ఏమైనా అయితే ఎవరు బాధ్యత అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.