జాతర కీలక ఘట్టం ఆవిష్కృతం

తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరలో అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. కోట్లాది భక్తులు ఎదురుచూస్తున్న సమయంలో, కన్నెపల్లి నుంచి శ్రీ సారలమ్మ గద్దెపై కొలువు తీరడం జాతరలో తొలి ప్రధాన ఘట్టంగా నిలిచింది. కొండాయి గ్రామం నుంచి గోవిందరాజుల దేవతను కన్నెపల్లికి తీసుకువచ్చిన అనంతరం, ఆదివాసీ ఆచారాల ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఘట్టం భక్తి పరవశ్య వాతావరణంలో జరిగింది.

సంబంధిత పోస్ట్