సర్వేలో భూముల వివరాలు నమోదు చేయలేదని భూయజమానుల ఆరోపణ

ములుగు జిల్లా, రామచంద్రపురం శివారు-2లోని సెక్టార్‌-7లో లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు నిర్వహించిన సర్వేలో తమ భూముల వివరాలను సరిగ్గా నమోదు చేయలేదని, ఇతరులకు నోటీసులు జారీ చేశారని భూయజమానులు తిప్పని రవీందర్, బొల్లపల్లి కుమారస్వామి ఆరోపించారు. తమ వద్ద పట్టా పాస్‌బుక్కులు, లింక్‌ డాక్యుమెంట్లు ఉన్నాయని, అధికారులు వాటిని పరిశీలించి క్షేత్రస్థాయిలో మోకా రిసర్వే నిర్వహించి భూమి హద్దులను తేల్చాలని వారు కోరారు. అన్ని పక్షాల పత్రాలు, రెవెన్యూ రికార్డులు పరిశీలించి సమగ్ర విచారణ అనంతరం సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రజావాణిలో వినతి అందజేసినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్

✕
✕