ఎలిశెట్టిపల్లిలో చిరుత కలకలం

ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ఎలిశెట్టిపల్లి గ్రామ శివారులో చిరుత పాదముద్రలు కనిపించడంతో గ్రామస్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. చిరుత సంచారంతో ప్రజలు, పశువుల భద్రతపై భయాందోళన వ్యక్తమవుతోంది. చిరుత జాడలను అటవీ శాఖ అధికారులు వెంటనే పరిశీలించి, కెమెరా ట్రాప్‌లు ఏర్పాటు చేసి కదలికలను గుర్తించాలని గ్రామస్థులు కోరుతున్నారు. చిన్నారులు, వృద్ధులు గ్రామ శివారు ప్రాంతాలకు ఒంటరిగా వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕