కమలాపురంలో ప్రమాదకర గుంతలను పూడ్చిన స్థానికులు

​మంగపేట మండలం కమలాపురం గోదావరి రోడ్డు మూలమలుపు వద్ద పెద్ద గుంతలు పడి నిత్యం వాహనదారులు, ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. అధికారుల స్పందన లేకపోవడంతో నారాయణ మేస్త్రి చొరవ తీసుకుని, లింగరాజు మేస్త్రి, జేసీబీ నాగరాజు, తాడేల ధర్మారావు, స్థానిక దాతల సహకారంతో శ్రమదానం చేపట్టారు. జేసీబీ సహాయంతో కంకర, సిమెంట్‌తో గుంతలను పూడ్చి రోడ్డు ప్రయాణానికి అనుకూలంగా మార్చారు. ప్రజా రక్షణే ధ్యేయంగా ముందుకు వచ్చిన వీరి సేవలను, ఉదారతను స్థానికులు, వాహనదారులు ఎంతగానో అభినందించారు.

సంబంధిత పోస్ట్

✕
✕