మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి: ఏఐకేఎఫ్

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్‌ను మంగళవారం ఏఐకేఎఫ్ నాయకులు కోరారు. రాష్ట్ర కోశాధికారి చంద్రయ్య మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, దళారులు క్వింటాల్‌కు రూ. 1,800కే కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మార్కెఫెడ్ ద్వారా గ్రామాల్లో కేంద్రాలు ఏర్పాటు చేసి క్వింటాల్‌కు రూ. 2,400కు కొనుగోలు చేయాలని, దళారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్