తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర వైభవంగా ముగిసింది. అమ్మవార్లు వనప్రవేశం చేయడంతో, లక్షలాది భక్తులు తమ గమ్యస్థానాలకు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ నేపథ్యంలో ములుగు-హన్మకొండ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. భక్తులను సురక్షితంగా చేరవేసేందుకు టీజీఎస్ ఆర్టీసీ (TGSRTC) దాదాపు 4,000 ప్రత్యేక బస్సులను రంగంలోకి దించింది. మేడారం బస్ స్టాండ్ నుండి బయలుదేరే బస్సులు రోడ్లపై కిలోమీటర్ల మేర క్యూ కట్టడంతో, సాధారణ వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు.