మేడారం జాతర.. లక్షలాది భక్తులతో కిక్కిరిసిన అమ్మవార్ల గద్దెలు

మేడారం జాతర శుక్రవారం ఉదయం నుంచి లక్షలాది మంది భక్తులతో కిక్కిరిసిపోయింది. సమ్మక్క-సారలమ్మలు గద్దెలపై కొలువుదీరడంతో, మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు పోటెత్తారు. దీనితో క్యూ లైన్లు 'క్రౌడ్ బరస్ట్'ను తలపించాయి. జంపన్నవాగు వద్ద కూడా తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ నెలకొంది.

సంబంధిత పోస్ట్