తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క సారల కొలువుదీరడంతో, ఈరోజు భారీ బందోబస్తు మధ్య భక్తులకు దర్శనాలు కల్పిస్తామని మంత్రులు తెలిపారు. పోలీస్ బందోబస్తుల మధ్య ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకుండా చూసుకుంటామని వారు హామీ ఇచ్చారు. ఏదైనా ప్రమాదం జరిగిన వెంటనే 108కు కాల్ చేయాలని పోలీసులు భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా, ములుగులో ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి.