నేటి నుంచే మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర ప్రారంభం కావడంతో భక్తులు లక్షల సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో ములుగు జిల్లా పస్రా ప్రాంతంలో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. బస్సులు, ప్రైవేట్ వాహనాల రద్దీ విపరీతంగా పెరిగి, రోడ్లపై కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ నియంత్రణ పోలీసులకు సవాలుగా మారింది. భక్తుల భద్రత కోసం పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది చర్యలు చేపడుతున్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.