మేడారం జాతరలో మంత్రి కొండా సురేఖ దూరంగా ఉండటం, మంత్రుల మధ్య దూరం తొలగలేదని వార్తలు వస్తున్నాయి. జాతర తొలిరోజు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలకు చేరుకోగా, వనదేవతలకు మంత్రి సీతక్క అధికారికంగా స్వాగతం పలికారు. మంత్రి పొంగులేటి కుటుంబసభ్యులతో కలిసి మొక్కులు చెల్లించుకున్నారు. అయితే, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవానికి సంబంధిత శాఖ మంత్రి హాజరుకాకపోవడం గమనార్హం.