నేడు ములుగు జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన

ములుగు జిల్లాలో బుధవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించనున్నారు. ములుగు మండలం ఇంచర్లలో ఉదయం 11 గంటలకు ఇందిరమ్మ లబ్ధిదారులకు ధ్రువీకరణ పత్రాలు అందజేస్తారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు పత్తిపల్లిలో జరిగే భూభారతి రెవెన్యూ సదస్సులో మంత్రి పాల్గొంటారని అధికార వర్గాలు తెలిపాయి మంత్రి పొంగులేటి పర్యటన సందర్భంగా అధికారులు, పోలీసులు ఏర్పాట్లు చేశారు.

సంబంధిత పోస్ట్