రాష్ట్ర మంత్రి సీతక్క సోమవారం ములుగు జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉదయం 9 గంటలకు జగ్గన్నపేటలో VO భవనం, సోలార్ ప్రాజెక్టును ప్రారంభించి మహిళలతో సమావేశమవుతారు. 10: 30కు మదనపల్లిలో మెడికల్ క్యాంపును ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు IDOCలో అంగన్వాడీల కోసం 'తొలిముద్ద (టిఫిన్)' పథకాన్ని రాష్ట్రంలో తొలిసారిగా ములుగులో ప్రారంభించనున్నారు.