మేడారం గద్దెలపై కొలువైన శ్రీ సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను మంత్రి సీతక్క దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవార్లకు మొక్కులు సమర్పించిన మంత్రి, రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. అనంతరం జాతరకు వచ్చిన భక్తులతో కలసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.