ములుగు జిల్లా ములుగు మండలం ఇంచర్ల ఎం. ఆర్ గార్డెన్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి సీతక్క, కొత్తగూడ మండలం సాధిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన ఫుల్సం రవికిరణ్ అనే దివ్యాంగుడికి మూడు చక్రాల స్కూటీని స్వయంగా అందజేసి అండగా నిలిచారు. దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం, నాయకులు తీసుకుంటున్న చొరవకు ఈ కార్యక్రమం నిదర్శనంగా నిలిచింది.