శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, మంత్రి సీతక్క బుధవారం హైదరాబాద్ మాదాపూర్‌లోని శిల్పకళా వేదికలో ఉత్తమ సేవా పురస్కారం అందుకున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆమెకు ఈ పురస్కారాన్ని అందజేశారు. వేలాది మంది విద్యార్థుల సమక్షంలో మంత్రి సీతక్క ఈ గౌరవాన్ని అందుకోవడం విశేషం. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఆమె చేసిన కృషికి గాను ఈ పురస్కారం లభించింది.