రోడ్డు ప్రమాదంపై స్పందించిన మంత్రి సీతక్క

ములుగు జిల్లాలోని పస్రా–తాడ్వాయి రహదారిపై కొండపర్తి వద్ద శుక్రవారం ఘోర రోడ్డు జరిగిన విషయం తెలిసిందే. హన్మకొండ నుంచి గుంటూరు వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సు భద్రాచలం నుంచి వస్తున్న బొలెరోను ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బొలెరోలో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ములుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై మంత్రి సీతక్క వెంటనే స్పందించి, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్ ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు.

సంబంధిత పోస్ట్

✕
✕