హైదరాబాద్ నుండి హెలికాఫ్టర్ ద్వారా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్, సీతక్క, కొండ సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ బుధవారం మేడారం చేరుకున్నారు. ములుగు జిల్లాలోని సమ్మక్క సారలమ్మ దేవతల గద్దెల ప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. మేడారంలో జరిగే అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని వారు అధికారులను ఆదేశించారు.