రామప్పలో అద్భుతం.. శివలింగాన్ని తాకిన భానుడి కిరణాలు

ములుగు జిల్లా పాలంపేటలోని చారిత్రక రామప్ప దేవాలయంలో శుక్రవారం ఉదయం 6:30 గంటలకు అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సూర్య కిరణాలు నేరుగా గర్భగుడిలోని రామలింగేశ్వర స్వామి శివలింగాన్ని తాకడంతో గర్భాలయం బంగారు వర్ణంలో మెరిసిపోయింది. కాకతీయుల శిల్పకళా నైపుణ్యానికి నిదర్శనమైన ఈ అద్భుతం ఏటా ఒక మాసంలో రెండు, మూడు రోజుల పాటు కనిపిస్తుందని అర్చకులు హరీష్ శర్మ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్