బుధవారం ములుగు జిల్లా కేంద్రంలోని గట్టమ్మ దేవాలయాన్ని మంత్రి సీతక్క దర్శించుకున్నారు. అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి, వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం, తాడ్వాయిలోని జంగిల్ సఫారీ, హాట్స్ ను కలెక్టర్ దివాకర్, డిఎఫ్ఓ జావేద్ లతో కలిసి మంత్రి సీతక్క ప్రారంభించారు.