ములుగు: గుప్త నిధుల పేరిట మోసం.. అప్రమత్తంగా ఉండండి

ములుగు జిల్లా ఏటూరునాగారం ఎస్సై మహేశ్, గుప్త నిధుల పేరుతో జరుగుతున్న మోసాలపై ప్రజలను అప్రమత్తం చేశారు. తవ్వకాలు, పూజల పేరుతో బంగారం ఇస్తామని నమ్మించి నగదు, ఆభరణాలు దోచుకుంటున్నారని ఆయన తెలిపారు. ఇటీవల చిదిరాల వాసు కుటుంబం వద్ద నుంచి 3 తులాల బంగారం, రూ. 14 లక్షలు తీసుకుని మోసం చేసిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్