పర్యాటక వైభవానికి ములుగు అద్భుత నిలయం.. మంత్రి సీతక్క

ములుగు జిల్లా ప్రకృతి, చారిత్రక, సాంస్కృతిక పర్యాటకానికి అద్భుత నిలయమని రాష్ట్ర మంత్రి సీతక్క శుక్రవారం  అన్నారు. కాకతీయుల శిల్పకళా వైభవంతో పాటు పచ్చని అడవులు, సెలయేళ్లు, జలపాతాలు, గుట్టలు, వాగులతో ములుగు ప్రకృతి వర్ణశోభను సంతరించుకుందని పేర్కొన్నారు. వరల్డ్ టూరిజం డే–2026 సందర్భంగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన హెరిటేజ్ వాక్స్, తెలంగాణ దర్శిని, వివిధ పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ములుగు పర్యాటక ప్రాధాన్యతను ప్రజలకు చాటిచెప్పేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕