ములుగు జిల్లా వెంకటాపురం మండలం బీసీ మర్రిగూడెం పరిధిలో శుక్రవారం విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి చెందాడు. బీసీ మర్రిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని శాంతినగర్ పాఠశాలలో ఫ్యాన్ ఫిట్ చేస్తుండగా విద్యుత్ షాక్ కు గురైయ్యాడు.
మృతి చెందిన యువకుడు బీసీ మర్రిగూడెం పంచాయతీ కార్యాలయంలో సిబ్బందిగా పనిచేసే విజయ్ (30) గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసే విచారణ చేస్తున్నారు.