ములుగు: వన మహోత్సవంలో పాల్గొన్న మంత్రి సీతక్క

ములుగు జిల్లాలో అటవీ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం వన మహోత్సవం కార్యక్రమాన్ని మంత్రి సీతక్క నిర్వహించారు. ఇంచర్ల ఎకో పార్క్ లో వన మహోత్సవంలో మంత్రి సీతక్క పాల్గొని మొక్కలు నాటారు. మొక్కల పెంపకంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. వన మహోత్సవంలో భాగంగా ఎకో పార్క్ లో 25 వేల మొక్కలు విద్యార్థులతో కలిసి ఫారెస్ట్ అధికారులు నాటించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర, టిఎస్ డిఎఫ్ఓ రాహుల్, కిషన్ జాదవ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్