ములుగు: ఎస్పీని కలిసిన నాయకపోడు పూజారులు

ఆదివాసీ నాయకపోడు సంఘం ఆధ్వర్యంలో గట్టమ్మ పూజారులు మంగళవారం ములుగు ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ ను కలిసి, మేడారం జాతర సందర్భంగా నిర్వహించే ఎదురుపిల్ల వేడుకకు సంబంధించిన వివరాలను తెలియజేశారు. అనాదిగా గట్టమ్మ దేవాలయంలో నాయకపోడుల పూజా విధానం, ఆచార సంప్రదాయాలను వివరించారు. భక్తులకు మంచినీరు, మరుగుదొడ్ల వసతి కల్పించాలని, ఆలయం చుట్టుపక్కల లైటింగ్ ఏర్పాట్లు చేయాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్