మావోయిస్టులు చేస్తున్న చట్టవ్యతిరేక చర్యలను ఖండించాలని ఎస్పీ శబరీశ్ అన్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం ముకనూరుపాలెంకి చెందిన కామయ్య ఇటీవల గుట్టల్లో ప్రెజర్ బాంబ్ పేలి గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో బాధిత కుటుంబాన్ని ఆదివారం ఎస్పీ శబరీశ్ పరామర్శించారు. బాధిత కుటుంబానికి పోలీస్ శాఖ అండగా ఉంటుందని తెలిపారు. మావోయిస్టులు చేసిన దుశ్చర్యలను ప్రజలందరు ఖండించాలన్నారు.