ములుగు: '14న రామప్ప సందర్శన బంద్‌'

ప్రపంచ సుందరీమణులు రానున్న నేపథ్యంలో రామప్పలో ఈ నెల 14న పర్యాటకుల సందర్శన పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ములుగు కలెక్టర్‌ టీఎస్‌ దివాకర తెలిపారు. 14న మిస్‌వరల్డ్‌ పోటీల్లో సుందరీమణుల్లో 35 మంది రామప్ప వస్తున్నందున పాలంపేట ఆర్చి లోపలికి మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఎవరికీ అనుమతి లేదన్నారు. దాదాపు 5 కిలోమీటర్ల వరకు డ్రోన్‌ కెమెరాలను ఎగరవేయడం నిషేధమని శనివారం పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్