ప్రస్తుతం మేడారంలో అందరి దృష్టి ఖమ్మం జిల్లా కల్లూరు ACP వసుంధర యాదవ్ వేసిన డ్యాన్స్ పై పడింది. ఆమె డ్యాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. దీంతో యూపీకి చెందిన ఆమె గురించి నెటిజన్లు ఆసక్తిగా వెతుకుతున్నారు. గతంలో మహాకుంభమేళాలో మోనాలిసా కళ్లను చూసి అందరూ ఫిదా అయ్యారు, ఆమెను సెలబ్రిటీగా మార్చి హీరోయిన్‌గా తీర్చిదిద్దారు.