తేదీ 08-04-2025న గోవిందరావుపేట మండలం, రాంనగర్ గ్రామంలో మాజీ సర్పంచ్ మోహన్ రాథోడ్ కు చెందిన పామాయిల్ తోటను గుర్తుతెలియని దుండగులు నిప్పంటించారు. ఈ ఘటనపై వై సతీష్ రెడ్డి, లకవత్ నరసింహ నాయక్, పిన్నింటి మధుసూదన్ రెడ్డి, జంపయ్య తదితరులు తోటను పరిశీలించి, రైతుకు జరిగిన నష్టాన్ని చూసి చలించిపోయారు. మోటారు, డ్రిప్స్ పైపులు, మొక్కలు పూర్తిగా కాలిపోయాయని, రైతుకు తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు. నిప్పంటించిన దుండగులను వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలని, రైతు మోహన్ రాథోడ్ కు భరోసా కల్పించాలని పోలీసు శాఖను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మహేష్ నాయక్, ఎన్. రవి కిరణ్, దుంపలగూడెం సర్పంచ్ సీతారాం నాయక్, ఉట్ల పృథ్వి రాజ్ పాల్గొన్నారు. జరిగిన నష్టాన్ని ప్రభుత్వ అధికారులు సర్వే చేసి, రైతుకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.