మేడారం మహా జాతరకు భక్తులు పోటెత్తారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నుండి తిరుగు ప్రయాణానికి అందుబాటులో ఒక్క బస్సు కూడా లేకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహిస్తున్నారు. నిన్న మధ్యాహ్నం 3 గంటల నుండి బస్టాండ్ వద్దనే ఉన్నామని.. కనీసం తాగడానికి కూడా నీళ్లు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు బస్సుపై రాళ్లు రువ్వారు. దీంతో బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి.