మేడారంలో శుక్రవారం రాత్రి నుండి తిరుగు ప్రయాణానికి ఒక్క బస్సు కూడా అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహించి బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. నిన్న మధ్యాహ్నం 3 గంటల నుండి బస్టాండ్ వద్దనే ఉన్నామని, కనీసం తాగడానికి కూడా నీళ్లు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. తాడ్వాయి నుండి వచ్చే దారిలో ట్రాఫిక్ జామ్ కావడంతో బస్సులు రాలేక పోయాయని అధికారులు తెలిపారు. శనివారం ఉదయం నుండి ట్రాఫిక్ క్లియర్ కావడంతో ఆర్టీసీ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.