ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ టీఎస్ దివాకర్ అన్నారు. శుక్రవారం ములుగు జిల్లా ఏటూరునాగారం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని క్యాజువాలిటీ, పీఎంసీ, డెంగ్యూ వార్డులను పరిశీలించారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు.