మేడారం వనదేవతల చెంతకు పోటెత్తిన జనం

ములుగు జిల్లాలోని మేడారంలో కొలువైన సమ్మక్క-సారలమ్మల దర్శనార్థం ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. శనివారం రాత్రి నుంచే వేలాది మంది భక్తులు మేడారం చేరుకున్నారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి, తల్లుల గద్దెల వద్దకు క్యూ కట్టారు. వనదేవతలకు ఇష్టమైన పసుపు, కుంకుమ, చీరెసారె, కొబ్బరికాయలతో పాటు తమ బరువుకు తూగే 'బంగారం' సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

సంబంధిత పోస్ట్