మంగపేట ప్రజావాణిలో విద్యార్థుల సమస్యపై వినతి

ములుగు జిల్లా, మంగపేట ZPHSలో నూతనంగా నిర్మించిన మరుగుదొడ్లకు డ్రైనేజీ పైప్‌లైన్ అనుసంధానం చేయాలని, విద్యార్థులకు పూర్తిస్థాయి సౌకర్యం కల్పించాలని కోరుతూ విద్యార్థుల తల్లిదండ్రులు సోమవారం MPDOకు వినతిపత్రం అందజేశారు. నాలుగు నెలలుగా మరుగుదొడ్లు పూర్తయినా డ్రైనేజీ అనుసంధానం లేకపోవడంతో విద్యార్థులు, ముఖ్యంగా బాలికలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అధికారులు, గ్రామస్థులతో సమన్వయం చేసి సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్

✕
✕