ములుగు జిల్లా మల్లంపల్లిలో జనవరిలో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. రవి ఇంట్లో 65 గ్రాముల బంగారం, రూ. 35 వేల నగదు చోరీకి గురైన ఘటనపై సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేపట్టారు. ఖానాపురానికి చెందిన నలుగురు ఈ దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించి, వారిలో బోడ గని, అల్వాల విపిన్, జబ్బ సిద్దును అరెస్టు చేశారు. వారి నుంచి 20.691 గ్రాముల బంగారు ఆభరణాలను రికవరీ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.