శ్రీ సమ్మక్క- సారలమ్మ తల్లుల దర్శనం కోసం వచ్చే భక్తులకు సింగరేణి మైన్స్ రెస్క్యూ సర్వీస్ సిబ్బంది అండగా నిలుస్తున్నారు. మొక్కులు చెల్లించుకునే క్రమంలో గాయపడిన భక్తులకు తక్షణ వైద్య సేవలు అందిస్తున్నారు. 3 షిఫ్టులలో, ప్రతి షిఫ్టుకు 12 మంది చొప్పున నిత్యం అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్నారు. జాతర ప్రారంభం నుండి ఇప్పటి వరకు 386 మందికి ప్రథమ చికిత్సలు చేసి, అవసరమైన వారిని ఆస్పత్రులకు తరలించారు.