ముప్పనపల్లిలో రోడ్డు మరమ్మతులు

ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం ముప్పనపల్లిలో త్వరలో జరగనున్న దర్గా ఉరుసు ఉత్సవాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం మంగళవారం రోడ్డు మరమ్మతు పనులు చేపట్టారు. ఉప సర్పంచ్ చిదరి సుమన్ సొంత సహకారంతో గుంతలమయమైన దారిని బాగు చేయించారు. ఉత్సవాల సమయంలో భక్తుల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ చర్యలు తీసుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు.

సంబంధిత పోస్ట్