ములుగు జిల్లా మల్లంపల్లి మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాలు, గోదాంలను ఏవో శ్రీధర్ ఆధ్వర్యంలో అధికారులు సోమవారం తనిఖీ చేశారు. ఎరువుల నిల్వలు, స్టాక్ రిజిస్టర్లు, బిల్లులు, విక్రయ వివరాలను పరిశీలించారు. అనుమతి లేని ఎరువులు, నిబంధనలకు విరుద్ధమైన మిశ్రమాలు విక్రయిస్తే చట్టప్రకారం చర్యలు తప్పవని ఏవో శ్రీధర్ హెచ్చరించారు. రైతులకు తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాలని, స్టాక్ వివరాలను సక్రమంగా నమోదు చేయాలని వ్యాపారులకు సూచించారు.