మంగపేట మండలం నిమ్మగూడెం గ్రామానికి చెందిన మద్దేలా చంద్రయ్య ఇటీవల మృతి చెందగా, శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ చైర్మన్, బిఆర్ ఎస్ నాయకులు బాడీశ నాగ రమేష్ బాధితులకు అండగా నిలిచారు. ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులను ఓదార్చి, దశదిన కర్మ ఖర్చుల కోసం బిఆర్ఎస్ నాయకుల చేతుల మీదుగా ఆర్థిక సహాయం అందించారు. మాజీ గ్రామాధ్యక్షుడు కొమరం పుల్లారావు, రూప భద్రయ్య, పండ శ్రీను, గొప్ప చంద్రకాంత్, కొమరం బాలకృష్ణ, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.