మేడారం క్యూ లైన్లలో తొక్కిసలాట.. పలువురికి గాయాలు

మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా బుధవారం భక్తుల రద్దీతో స్వల్ప తొక్కిసలాట చోటు చేసుకుంది. దర్శన క్యూ లైన్లలో తోపులాట జరగడంతో పలువురు మహిళలు, వృద్ధులు కిందపడిపోయారు. ఈ ఘటనలో ఓ మహిళ తలకు తీవ్రగాయం కావడంతో అక్కడే ఉన్న ఎన్ఎస్ఎస్ వలంటీర్ స్పందించి ఆమెను ఆసుపత్రికి తరలించారు. భారీగా తరలివచ్చిన భక్తులతో క్యూలైన్లు కిక్కిరిసిపోవడంతో కొంతసేపు ఉద్రిక్తత పరిస్థితి జరిగింది.

సంబంధిత పోస్ట్