మేడారంలోని సమ్మక్క, సారలమ్మ ఆలయాల అభివృద్ధిలో భాగంగా పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెల నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. బుధవారం రాతి పిల్లర్లను అధికారులు ఏర్పాటు చేశారు. గద్దెల పనులు పూర్తయిన తర్వాత గిరిజన సంప్రదాయాల ప్రకారం పూజారులు ధ్వజస్తంభాల పునఃప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. భారీ క్రేన్ల సహాయంతో పిల్లర్ల ఏర్పాటు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.