తాడ్వాయి: పెద్దపులి దాడిలో ఆవు మృతి

ములుగు జిల్లా తాడ్వాయి మండలం బయ్యక్కపేట సమీపంలోని అటవీ ప్రాంతంలోని బూడిదపెంట గొత్తికోయ గూడెంలో పెద్దపులి దాడి చేయడంతో ఒక ఆవు మృతి చెందింది. ఆదివారం అటవీశాఖ అధికారులు గొత్తికోయ గ్రామం వెళ్లి పెద్దపులి అడుగు జాడల కోసం అన్వేషిస్తున్నారు. కాగా పెద్దపులి సమ్మక్క-సారలమ్మలు కొలువై ఉన్న మేడారం వైపు వెళ్లినట్లు అడుగులు గుర్తించారు. దీంతో గిరిజన గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

సంబంధిత పోస్ట్