ములుగు జిల్లా మేడారం సమ్మక్క, సారలమ్మ గద్దెల వద్ద భక్తుల రద్దీ నెలకొంది. శనివారం అర్థరాత్రి నుంచే భక్తుల రాక మొదలైంది. ఆదివారం వేకువజామునే జంపన్న వాగులో పుణ్య స్నానాలు చేసి, వనదేవతల దర్శనానికి బారులు తీరారు. నేడు 2 లక్షల మందికి పైగా భక్తులు మేడారానికి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.