మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులను సిద్ధం చేయాలని, ఉపాద్యాయుల చేతుల్లోనే విద్యార్థుల భవిష్యత్ ఉంటుందని మంత్రి సీతక్క అన్నారు. బుధవారం గోవిందరావుపేట మండలం చల్వాయి మోడల్ స్కూల్లో అదేవిధంగా జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయులకు గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను పరిశీలించారు. సమాజ స్థాపనలో విద్యార్థులను ఉత్తమమైన, ఆదర్శనీయమైన విద్యార్థులుగా సిద్ధం చేయాలని మంత్రి సూచించారు.