మేడారం జాతరలో హిజ్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. దేశం నలుమూలల నుండి భక్తులు తరలివచ్చే ఈ జాతరలో, హిజ్రాలు తమ కుటుంబ సమేతంగా వనదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. సమ్మక్క తల్లినీ ఆవాహన చేసుకుని, బంగారం (బెల్లం), మద్యం సమర్పించి, కోళ్ళను, మేకలను బలి ఇచ్చి అమ్మవార్లను పూజిస్తున్నారని తెలిపారు. కోరిన కోర్కెలు తీర్చి కొంగు బంగారంగా నిలిచే వనదేవతలను దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.