ములుగు జిల్లా మేడారంలో గురువారం తిరుగువారం పండుగను పూజారులు ఘనంగా నిర్వహించారు. ఈ పండుగతో మేడారం మహాజాతర ముగిసింది. మేడారంలోని సమ్మక్క దేవాలయం, కన్నెపల్లిలోని సారలమ్మ దేవాలయం, కొండాయిలోని గోవిందరాజు, పునుగోండ్లలోని పగిడిద్దరాజు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. పూజారులు దేవాలయాల్లోని పూజ సామాగ్రిని శుద్ధి చేసి భద్రపరిచారు. కోళ్లు, మేక పోతులను బలిచ్చి, 'సల్లంగ చూడు తల్లి' అంటూ పూజారులు, వారి కుటుంబ సభ్యులు అమ్మవారిని వేడుకున్నారు.