ఏటూరునాగారంలో కురిసిన కుండపోత వర్షం

ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో శుక్రవారం సాయంత్రం నుండి కుండపోతగా వర్షం కురుస్తోంది. గత 4 రోజులుగా వర్షాలు కురవక, ఉక్కపోతలతో ప్రజలు అల్లాడిపోయారు. శుక్రవారం కురిసిన వర్షంతో కాస్త ఉపశమనం పొందారు. ఇదిలా ఉండగా వర్షాధార పంటలపై ఆధారపడిన రైతులకు ఈ వర్షం కాస్త లాభదాయకంగా ఉందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వరినాట్లు వేసిన రైతులు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు.

సంబంధిత పోస్ట్