వీఐపీల కారణంగానే మేడారంలో ట్రాఫిక్ సమస్య.. సీతక్క క్లారిటీ

మంత్రి సీతక్క శుక్రవారం మేడారంలో తలెత్తిన ట్రాఫిక్ సమస్యపై స్పందిస్తూ, వీఐపీల కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆదివారం తెలిపారు. ఒక్కో వీఐపీ సుమారు 50 వాహనాలను తీసుకురావడంతో బస్సులను ఆపాల్సిన పరిస్థితి వచ్చిందని, పాసులు 10వేలలోపు జారీ చేసినా కొందరు సొంతంగా ముద్రలు వేసుకొని వచ్చారని ఆమె పేర్కొన్నారు. మొత్తం 200 మంది వీఐపీలు తమ వాహనాలతో ఇబ్బందులు సృష్టించారని మంత్రి సీతక్క అన్నారు.

సంబంధిత పోస్ట్